BJP: ఫోన్‌ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్‌ సీబీఐ దర్యాప్తు కోరాలి: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేశారని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 03 Apr 2024 12:24 IST

హైదరాబాద్‌: గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేశారని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లోనూ ట్యాపింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. దీని సూత్రధారులపై పూర్తిస్థాయి విచారణ చేయాలన్నారు. సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. అసలైన దోషులను వదిలిపెట్టొద్దన్నారు. 

సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ దర్యాప్తు కోరాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, భారాస వైఖరి.. టామ్‌ అండ్‌ జెర్రీ ఫైట్‌లా ఉందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పరస్పర విమర్శలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ‘ధరణి’ మీద విచారణకు కమిటీ వేశారని.. దానికి అతీగతీ లేదన్నారు. భారాస ప్రభుత్వం పదేళ్ల పాటు ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిందన్నారు. దీనిపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ రాలేదంటే ఆధారాలు గట్టిగా ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని