BJP: భాజపా నాలుగో జాబితా.. విరుదునగర్‌ నుంచి రాధికా శరత్‌ కుమార్‌

Radhika Sarathkumar: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సినీ నటి రాధికా శరత్‌ కుమార్‌ తమిళనాడులోని విరుదునగర్‌ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

Updated : 22 Mar 2024 19:08 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మరో జాబితాను భారతీయ జనతా పార్టీ (BJP) శుక్రవారం విడుదల చేసింది. పుదుచ్చేరీలోని ఒకటి, తమిళనాడులోని 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రముఖ సినీనటి రాధికా శరత్‌ కుమార్‌ (Raadhika Sarathkumar) విరుదునగర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల ఆమె భర్త ఆర్‌.శరత్‌ కుమార్‌ (Sarath kumar) తన పార్టీ ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి (AISMK)ని భాజపాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. పుదుచ్చేరీ లోక్‌సభ స్థానం నుంచి నమశ్శివాయం బరిలోకి దిగుతున్నారు.

తమిళనాడు అభ్యర్థుల జాబితా ఇదే..

  • తిరువళ్లూరు - పొన్‌. వి. బాలగణపతి
  • చెన్నై నార్త్‌ - ఆర్‌.సి. పాల్‌ కనగరాజ్‌
  • తిరువన్నామలై - ఎ. అశ్వత్థామన్‌
  • నమక్కల్‌ - కె.పి. రామలింగం
  • తిరుప్పూర్‌- ఎ.పి. మురుగనందం
  • పొల్లాచ్చి - కె. వసంతరాజన్‌
  • కరూర్‌ - వి.వి. సెంథిల్‌నాథన్‌
  • చిదంబరం - పి. కాత్యాయని
  • నాగపట్టిణం - ఎస్‌జీఎం రమేశ్‌
  • తంజావూరు - ఎం. మురుగనందం
  • శివలింగ - దేవనాథన్‌ యాదవ్‌
  • మదురై - రామ శ్రీనివాసన్‌
  • విరుదునగర్‌ - రాధికా శరత్‌ కుమార్‌
  • తెన్‌కాశీ - జాన్‌ పాండియన్‌

గతంలో 195 మందితో తొలి జాబితా, ఇటీవల 72 మందితో రెండో జాబితా, 9 మందితో మూడో జాబితాను భాజపా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 15 మందితో నాలుగో జాబితాను ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 291 స్థానాల్లో కాషాయ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని