Lok Sabha Polls: చెన్నై సౌత్‌ నుంచి తమిళి ‘సై’.. భాజపా మూడో జాబితా విడుదల

లోక్‌సభ ఎన్నికలకు భాజపా అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది.

Updated : 24 Mar 2024 14:46 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు భాజపా అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. తమిళనాడుకు సంబంధించి తొమ్మిది స్థానాలకు కమలం పార్టీ (BJP) అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ (Tamilisai Soundarajan)ను చెన్నై సౌత్‌ సీటు నుంచి బరిలో దించింది. ఇటీవల తెలంగాణ గవర్నర్‌ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి తమిళి సై రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె భాజపాలో చేరి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాసేవ చేసేందుకే తాను తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టినట్లు తెలిపిన ఆమె.. ఈ ఎన్నికల్లో చెన్నై సౌత్‌ నుంచి బరిలో దిగుతున్నారు. అలాగే, కోయంబత్తూరు నుంచి భాజపా తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై పోటీ చేస్తున్నారు. భాజపా అభ్యర్థుల మూడో జాబితా ఇదే.. 

  • చెన్నై సౌత్‌ - డా. తమిళి సై సౌందరరాజన్‌
  • చెన్నై సెంట్రల్‌ - వినోజ్‌ పి.సెల్వం
  • వెల్లూరు - డా ఎ.సి. షణ్ముగం
  • కృష్ణగిరి - సి.నరసింహన్‌
  • నీలగిరిస్‌ (ఎస్సీ) డా. ఎల్‌. మురుగన్‌
  • కోయంబత్తూరు - కె. అన్నామలై
  • పెరంబలూరు - టి.ఆర్‌. పార్వేందర్‌
  • తూత్తుకుడి - నైనార్‌ నాగేంద్రన్
  • కన్యాకుమారి - పొన్‌. రాధాకృష్ణన్‌

గతంలో 195 మందితో తొలి జాబితా, ఇటీవల 72 మందితో రెండో జాబితాను విడుదల చేసిన భాజపా.. తాజాగా గురువారం మరో తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లతో మూడో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 276 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు