Himachal: భాజపా ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది: సీఎం సుఖు

ధన బలంతో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా కుట్రలు చేసిందని.. తమ ఎమ్మెల్యేలను లాక్కొనేందుకు చౌకబారు ప్రయత్నాలు చేస్తోందంటూ హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు ఆరోపించారు.

Published : 16 Mar 2024 00:17 IST

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపా (BJP) తీరుపై కాంగ్రెస్‌ నేత, ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు (Sukhvinder Singh Sukhu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటోందని, నైతిక విలువలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ధన బలంతో సిట్టింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేసిందని, తమ  ఎమ్మెల్యేలను లాక్కొనేందుకు చౌకబారు ప్రయత్నించిందని ఆరోపించారు. శిమ్లాలోని రాంపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని సర్హాన్‌లో రూ.165 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రకటించిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 

హిమాచల్‌లో తిరుగుబాటు ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి వాళ్లు రాష్ట్రం వెలుపల ఉండేందుకు ఆర్థిక సాయం చేసిందెవరని ఈ సందర్భంగా సుఖు ప్రశ్నించారు. నైతిక విలువలను తుంగలో తొక్కి అధికారంలోకి వచ్చేందుకు చేస్తోన్న వ్యూహాలు ప్రజలకు బాగా తెలుసన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నామని..18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1500ల చొప్పున ఇస్తామన్న హామీని ఇటీవల సాకారం చేశామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 5లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతోందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు