Loksabha polls: ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకుపోతుంది: అఖిలేష్‌ యాదవ్

ఎన్నికల్లో ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు భాజపా తుడిచిపెట్టుకుపోతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బుధవారం పేర్కొన్నారు.

Published : 17 Apr 2024 15:20 IST

లఖ్‌నవూ: వచ్చే ఎన్నికల్లో ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు భాజపా తుడిచిపెట్టుకుపోతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh yadav) బుధవారం పేర్కొన్నారు. అఖిలేష్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... ‘‘ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి భాజపాను ఘజియాబాద్‌ నుంచి ఘాజీపూర్‌ వరకు తుడిచిపెడుతుంది. రైతులు భాజపా తీరుతో విసిగిపోయి ఉన్నారు. ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రజలకు కొత్త ఆశను కలిగిస్తోంది. తమ మేనిఫెస్టోలో పేదరిక నిర్మూలనకు సంబంధించిన ఎన్నో అంశాలు ఉన్నాయని రాహుల్‌గాంధీ చెప్పినట్లుగా భారత కూటమిలోని భాగస్వామ్య పార్టీలు రైతులకు కనీస మద్దతు ధరలను ఇస్తామని హామీ ఇస్తున్నాయి. భారత ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచిన రోజే దేశంలో పేదరికం అంతమవుతుంది’’ అని అన్నారు. 

భాజపా అవినీతిపరుల అడ్డాగా మారిందని ఆయన విమర్శించారు. ఎలక్టోరల్‌ బాండ్లు వారి అవినీతిని బట్టబయలు చేశాయన్నారు. పశ్చిమం నుంచి వీచే గాలి భారత మొదటి దశ ఎన్నికలను ప్రభావితం చేస్తుందని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఏప్రిల్ 26న, ఘాజీపూర్‌లో జూన్ 1న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అఖిలేష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని