Bonda Uma: ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వినడం న్యాయమా?: బొండా ఉమా

వైకాపా ఘోరంగా ఓడిపోతుందని తెలిసే అరాచకాలకు పాల్పడుతోందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 20 Mar 2024 15:05 IST

అమరావతి: వైకాపా ఘోరంగా ఓడిపోతుందని తెలిసే అరాచకాలకు పాల్పడుతోందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వినడం న్యాయమా?అని ప్రశ్నించారు. జగన్‌, పెద్దిరెడ్డి, సజ్జల ఆదేశాలు పాటించే ఇదంతా చేస్తున్నారన్నారు. జగన్‌ ప్రభుత్వం నిరంతరం ట్యాపింగ్‌ చేస్తోందని.. తమతో పాటు అధికారుల ఫోన్లపైనా నిఘా ఉంచారని ఆరోపించారు. మంత్రులు ఇచ్చిన స్టేట్‌మెంట్లే ఇందుకు నిదర్శనమన్నారు. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో గెలవాలని వైకాపా చూస్తోందన్నారు. ఆ పార్టీ అరాచకాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బొండా ఉమా డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని