Andhra News: త్వరలోనే రాజధాని విశాఖ నుంచి సీఎం పాలన: ఏపీ మంత్రి బొత్స
విశాఖను ఏపీ పాలనా రాజధానిగా వద్దన్నవారంతా చరిత్రహీనులు అవుతారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అమరావతి: విశాఖను ఏపీ పాలనా రాజధానిగా వద్దన్నవారంతా చరిత్రహీనులు అవుతారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జనసేన పార్టీకి ఒక విధానమంటూ లేదని.. రాజకీయ పార్టీకి ఉండాల్సిన సిద్ధాంతాలూ లేవని విమర్శించారు. త్వరలోనే పరిపాలనా రాజధాని విశాఖ నుంచి సీఎం విధులు నిర్వహిస్తారని తెలిపారు. మూడు రాజధానులపై సీఎం జగన్ నిర్ణయానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. పరిపాలనా రాజధానిగా విశాఖ తప్పక వస్తుందని బొత్స విశ్వాసం వ్యక్తంచేశారు. రాజధాని.. కావాలా వద్దా అని ఇంటింటికీ వెళ్లి అడగండన్నారు. జనసేన రాజకీయ పార్టీ కాదని.. దానికి ఒక సిద్ధాంతం ఏమీ లేదన్నారు. విశాఖను పవన్ ఎందుకు వద్దంటున్నారు.. ఆయన ఇక్కడినుంచే పోటీ చేశారు కదా? అని బొత్స వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్
-
Linda Yaccarino:‘ఎక్స్’రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతోంది: లిండా యాకారినో
-
Rajnath: DAD.. రక్షణశాఖ నిధులకు సంరక్షకుడు: రాజ్నాథ్