Telangana News: వైఎస్‌ షర్మిల ఫైటర్‌.. తగ్గేదేలే: బ్రదర్‌ అనిల్‌

పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో వైఎస్‌ షర్మిలను ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్ర చేస్తున్న మహిళపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated : 29 Nov 2022 22:13 IST

హైదరాబాద్‌: పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో వైఎస్‌ షర్మిలను ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్ర చేస్తున్న మహిళపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైతెపా వాహనాలు ధ్వంసం చేసిన వారిపై మాత్రం కేసులు పెట్టలేదని, బాధితులపైనే పోలీసులు కేసులు పెట్టారని ఆరోపించారు. పోలీసులు పెట్టిన కేసులపై న్యాయపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు. షర్మిల ఫైటర్‌.. తగ్గేదేలేదన్నారు. షర్మిలపై పెట్టిన సెక్షన్లలో ఒక్కటైనా పోలీసులు రుజువు చేస్తారా?అని అనిల్‌ ప్రశ్నించారు

మరో వైపు భారీ పోలీసు బందోబస్తు మధ్య వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పంజాగుట్ట పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు.  ప్రగతిభవన్‌ ముట్టడికి  కారులో ఆమె వెళ్తుండగా పోలీసులు పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు సృష్టించారని, అధికారుల విధులకు ఆటంకం కలిగించారని షర్మిలతో పాటు మరో ఐదుగురు వైతెపా నాయకులపై పలు సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం షర్మిలను నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు  వద్ద అదనపు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని