TSPSC ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని తొలగించండి: ఎమ్మెల్సీ కవిత

రాష్ట్రగీతం గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.

Updated : 08 Feb 2024 12:31 IST

హైదరాబాద్‌: రాష్ట్రగీతం గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రేవంత్‌ ఎన్నడూ ‘జై తెలంగాణ’ అని కూడా అనలేదన్నారు. ‘‘తెలంగాణ తల్లి విగ్రహం నాలా ఉందని సీఎం అంటున్నారు. నేనూ తెలంగాణ ఆడబిడ్డనే కదా?’’ అని ప్రశ్నించారు. మహేందర్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని.. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా ఆయనను తొలగించి, న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

‘‘రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో 3-4 గంటలపాటు విద్యుత్‌ కోతలు ఉంటున్నాయి. విద్యుత్‌ సంస్థల్లో ఏపీ వాళ్లను డైరెక్టర్‌లుగా నియమించారు. తెలంగాణ అసెంబ్లీకి ఏపీ అడ్వైజర్‌ ఎందుకు? గతంలో సలహాదారులే వద్దన్న రేవంత్‌ ఇప్పుడెలా నియమిస్తున్నారు? ఇదంతా రాజకీయ పునరావాసం కోసమే కదా?’’ అని కవిత ప్రశ్నించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని