BSP: ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: బీఎస్పీ

బీఎస్పీ అభ్యర్థులు ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది.

Published : 25 Mar 2024 23:33 IST

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP) ప్రకటించింది. తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో పార్టీ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ సమన్వయకర్త, విశ్రాంత డీజీపీ పూర్ణచంద్రరావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో ఆధిపత్య కులాల కుట్ర రాజకీయాలను ఎండగడతామన్నారు. నెల్లూరు సహా రాయలసీమలోని 62 స్థానాల్లో పోటీ చేసే 40 మంది అభ్యర్థులది ఒకే సామాజిక వర్గమని తెలిపారు. తితిదే కార్యనిర్వాహకవర్గం సైతం ఆ సామాజికవర్గం చేతిలోనే ఉందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని