Bypoll: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన రోజుల వ్యవధిలోనే మరోసారి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది.

Updated : 11 Jun 2024 04:51 IST

జులై 10న పోలింగ్‌

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన రోజుల వ్యవధిలోనే మరోసారి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. మొత్తం ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జులై 10న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఎమ్మెల్యేల రాజీనామాలు, ప్రజాప్రతినిధుల మృతి కారణంగా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. జులై 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిఉందని ఈసీ తెలిపింది. రుపౌలీ (బిహార్‌), రాయ్‌గంజ్, రాణాఘాట్‌ దక్షిణ్, బాగదా, మానిక్‌తలా (పశ్చిమ బెంగాల్‌), విక్రవాండీ (తమిళనాడు), అమర్‌వాఢా (మధ్యప్రదేశ్‌), బద్రీనాథ్, మంగ్లౌర్‌ (ఉత్తరాఖండ్‌), జలంధర్‌ వెస్ట్‌ (పంజాబ్‌), దెహ్రా, హమీర్‌పుర్, నాలాగఢ్‌ (హిమాచల్‌ప్రదేశ్‌) అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు