Jeevan Reddy: భారాస మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కబ్జా కేసు

తన భూమిని ఆక్రమించి బెదిరించారంటూ ఫిర్యాదు మేరకు ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.

Published : 25 May 2024 03:13 IST

భూమిని ఆక్రమించి బెదిరించారని ఫిర్యాదు

చేవెళ్ల గ్రామీణం, న్యూస్‌టుడే: తన భూమిని ఆక్రమించి బెదిరించారంటూ ఫిర్యాదు మేరకు ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. సీఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులో సామ దామోదర్‌రెడ్డికి 300 ఎకరాల భూమి ఉంది. ఇందులో ఆయన చైతన్య రిసార్ట్స్‌ పేరుతో ప్లాట్లు చేయడంతో పాటు తన తండ్రి పేరుతో కల్యాణమండపం, గుడి నిర్మించారు. జీవన్‌రెడ్డి ఆయన వద్ద నుంచి 2016లో 93 ఎకరాల భూమిని తీసుకుని అభివృద్ధి చేస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు అభివృద్ధి చేయకపోగా దామోదర్‌రెడ్డికి డబ్బులు కూడా ఇవ్వలేదు. కల్యాణమండపం పేరును మార్చేశారు. గుడిలో పూజలు కూడా చేయనివ్వడం లేదు. ఈ క్రమంలోనే దామోదర్‌రెడ్డి ఇటీవల ఆ భూమిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా జీవన్‌రెడ్డి మనుషులు లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆ స్థలాన్ని జీవన్‌రెడ్డి తన ఆధీనంలో ఉంచుకుని తనను బెదిరిస్తున్నారని దామోదర్‌రెడ్డి గత బుధవారం చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జీవన్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు