Telangana secretariat: రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా: కోదండరామ్‌

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు.

Updated : 06 Dec 2023 16:37 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సచివాలయం వద్ద బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో  పాటు తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కూడా సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం’’ అని కోదండరామ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని