Chandra Babu: తెదేపా అధినేత చంద్రబాబు ఘన విజయం.. రేపు దిల్లీకి పయనం

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.

Updated : 04 Jun 2024 18:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. కుప్పం స్థానం నుంచి  పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి కేఆర్‌జే భరత్‌పై 47 వేలకుపైగా ఓట్లతో చంద్రబాబు విజయం సాధించారు. ఈ క్రమంలో రేపు దిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఎన్టీయే కూటమి సమావేశంలో పాల్గొననున్నారు.

సంబరాల్లో తెదేపా

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించడంతో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్‌ తన తల్లి భువనేశ్వరిని ప్రేమగా ముద్దాడారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విక్టరీ సింబల్‌ చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు