Chandrababu: ఏపీఎస్‌డీఆర్‌ఐ లక్ష్యమేంటి? పెట్టిన కేసులెన్ని?: చంద్రబాబు

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ అక్రమ అరెస్టు ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యే అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 

Updated : 29 Feb 2024 22:08 IST

అమరావతి: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ అక్రమ అరెస్టు ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యే అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని మండిపడ్డారు. శరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ ద్వారా అక్రమ కేసులు పెట్టి తెదేపా నేతలను టార్గెట్ చేస్తున్నారన్నారు. ఏపీఎస్‌ఆర్డీఐ అసలు ఎందుకు ఏర్పడింది? దీని లక్ష్యమేంటి? అని ప్రశ్నించారు. మూడేళ్లుగా వాళ్లు పెట్టిన కేసులెన్ని? ఎవరెవరిపై పెట్టారో? ప్రభుత్వం బయటపెట్టగలదా?అని నిలదీశారు. తెదేపా నేతలను వేధించడానికి సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకున్నట్టే.. ఇప్పుడు ఏపీఎస్‌డీఆర్‌ఐ ద్వారా కూడా రాజకీయ కక్షలను వైకాపా సర్కారు తీర్చుకుంటోందని దుయ్యబట్టారు. ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలన్నారు.

శరత్‌ను తీసుకెళ్లింది పోలీసులా? సైకో జ‌గ‌న్ తాడేప‌ల్లి ముఠానా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. టెర్రరిస్టులను అరెస్టు చేసిన‌ట్టు ఎందుకు ర‌హ‌స్యంగా ఉంచుతున్నారని నిలదీశారు. ఇదంతా చూస్తుంటే శ‌ర‌త్‌కు ఏమైనా హాని త‌ల‌పెట్టారా? అనే అనుమానాలు క‌లుగుతున్నాయన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నిక‌ల్లో జగన్‌కు ఓట‌మి తప్పదని.. వైకాపా కుతంత్రాల‌ను తిప్పికొడ‌తామని హెచ్చరించారు. తాడేపల్లి ప్యాలెస్ అండతోనే శరత్‌ను అక్రమంగా అరెస్టు చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న మండిపడ్డారు.  జగన్ సర్కార్‌కు మరో 45 రోజుల్లో రాజకీయ సమాధి కట్టడం ఖాయమని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు