Chandrababu: సీఎం జగన్‌ పింఛనర్ల పొట్టకొట్టారు: చంద్రబాబు

తెదేపా అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాజకీయ స్వార్థం కోసం సీఎం జగన్‌ పింఛనర్ల పొట్టకొట్టారని విమర్శించారు.

Published : 01 Apr 2024 16:17 IST

అమరావతి: రాజకీయ స్వార్థం కోసం సీఎం జగన్‌ పింఛనర్ల పొట్టకొట్టారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని పునరుద్ఘాటించారు. తెదేపా నేతలు, బూత్‌ లెవల్‌ కార్యకర్తలతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ రెండు నెలలు ఎవరికైనా పింఛన్‌ అందకపోతే.. అది కూడా కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారం నుంచి దిగిపోతూ కూడా జగన్‌ పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

‘‘పేదలకు పింఛన్‌ ఇప్పించే వరకు తెదేపా నేతలు రాజీ పడొద్దు. కలెక్టర్లను కలిసి పింఛన్‌ ఇళ్ల వద్దే అందేలా చూడాలి. ప్రజాక్షేత్రంలో జగన్‌ను దోషిగా నిలబెట్టాలి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత జగన్‌ రూ.13 వేల కోట్లు గుత్తేదారులకు దోచిపెట్టారు. 15 రోజుల్లో ఎవరెవరికి ఎంత బిల్లులు ఇచ్చారో ప్రకటించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం. తటస్థంగా పనిచేసే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో మెరుగైన జీతం వచ్చేలా చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని