Chandrababu: ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ ఏపీకి ఎలా చేరాయి?: చంద్రబాబు

వైకాపా మాఫియాతో దేశానికి ఆంధ్రప్రదేశ్‌ డ్రగ్స్‌ రాజధానిగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 21 Mar 2024 23:26 IST

అమరావతి: వైకాపా మాఫియాతో దేశానికి ఆంధ్రప్రదేశ్‌ డ్రగ్స్‌ రాజధానిగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్‌ని సీబీఐ స్వాధీనం చేసుకోవటం షాక్‌కు గురి చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఈ డ్రగ్స్ ద్వారా ఏం చేయాలనుకుందని ప్రశ్నించారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ ఏపీకి ఎలా చేరాయన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడుతుందనే తన భయాన్ని తాజా ఘటన ధ్రువీకరిస్తోందని మండిపడ్డారు. ఈ విపత్తుకు కారణమైన వారిని పట్టుకుని శిక్షించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.

డ్రగ్స్‌ మాఫియాను అరికట్టాలి: పవన్‌

వైకాపా ప్రభుత్వం ఏపీని మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. తాజాగా ఘటనతో రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు. డ్రగ్స్‌ మాఫియాను అరికట్టాలని పేర్కొన్నారు.

జగన్ ముఠా పాపాల పుట్ట బద్దలవుతోంది: లోకేశ్‌

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. విశాఖ తీరంలో బ్రెజిల్‌ నుంచి తరలిస్తున్న 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్త తనను కలవరానికి గురిచేసిందన్నారు. ఈ భారీ డ్రగ్స్‌ మాఫియాకు కేరాఫ్‌ అడ్రస్ నూటికి నూరుపాళ్లు తాడేపల్లి ప్యాలెస్‌ అని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని