chandrababu: ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్‌ జగన్‌?: చంద్రబాబు

ప్రపంచంలోని అన్ని కంపెనీలను ఏపీకి తీసుకొచ్చి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యత తనదేనని  తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Published : 29 Mar 2024 20:38 IST

వింజమూరు: ప్రపంచంలోని అన్ని కంపెనీలను ఏపీకి తీసుకొచ్చి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యత తనదేనని తెదేపా అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా వింజమూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తానని ప్రకటించారు.

‘‘నేను ఏం చేశానని జగన్‌ అడుగుతున్నారు. చరిత్ర చూస్తే తెలుస్తుంది. నేను సీఎంగా ఉన్నప్పుడు 9 సార్లు డీఎస్సీ వేశా. కానీ, జగన్‌ ఒక్క డీఎస్సీ పెట్టలేదు. నా పేరు చెబితే హైదరాబాద్‌లో హైటెక్‌సిటీ, అనంతపురంలో కియా కంపెనీ, ఎయిర్‌పోర్టులు గుర్తొస్తాయి. మరి ఐదేళ్లలో నువ్వేం చేశావు జగన్‌? ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించావా? ఒక్క ప్రాజెక్టయినా చేపట్టావా? సంపద సృష్టించి.. ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం తెలిసిన పార్టీ తెదేపా’’అని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని