Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ విడుదల

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) తిరుమల పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్‌ నుంచి తిరుమలకు వెళ్లిన ఆయన.. గురువారం రాత్రి అక్కడే బస చేయనున్నారు.

Updated : 30 Nov 2023 14:44 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) తిరుమల పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్‌ నుంచి తిరుమలకు వెళ్లిన ఆయన.. గురువారం రాత్రి అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం అమరావతికి రానున్నారు. 

డిసెంబర్‌ 2న విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకోనున్నారు. డిసెంబర్‌ 3న సింహాచలం వెళ్లి అప్పన్న స్వామి దర్శనం చేసుకుంటారు. డిసెంబర్‌ 5న శ్రీశైలం మల్లన్న దర్శనానికి చంద్రబాబు వెళ్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని