ChandraBabu: వైకాపా ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే 3 నెలల తర్వాత నేనిస్తా: చంద్రబాబు

తాను ఏ తప్పూ చేయకున్నా జైల్లో పెట్టి క్షోభకు గురి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగులో తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు.

Updated : 08 Dec 2023 15:26 IST

తెనాలి: తాను ఏ తప్పూ చేయకున్నా జైల్లో పెట్టి క్షోభకు గురి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు(ChandraBabu) అన్నారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగులో తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘తపాను రావడంతో రైతులకు భారీ నష్టం వచ్చింది. పంట చేతికొచ్చే వేళ తుపాను వచ్చి నష్టం మిగిల్చింది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. అందువల్లే అధిక నష్టం జరిగింది. డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడం వల్ల పొలాల్లోకి మురికి నీళ్లు వెళ్తున్నాయి.  రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వ అధికారులు ఎవరూ రాలేదు.  

నా పర్యటన ఖరారైతే తప్ప జగన్‌లో కదలిక రాలేదు: చంద్రబాబు

45ఏళ్లుగా ఒక్క తప్పు కూడా చేయలేదు. ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించకూడదా? ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే జైల్లో పెడుతున్నారు. తుపాను వల్ల ఎకరాకు రైతులు(AP Farmers) ₹50వేలు నష్టపోయారు. రైతులకు ఈ ప్రభుత్వం ఏవైనా ఇన్‌పుట్స్‌ ఇచ్చిందా? మనకు జరిగిన అన్యాయం కోసం పోరాడదాం. నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇప్పించే బాధ్యత నాది. వైకాపా(YSRCP) ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే.. 3 నెలల తర్వాత నేనే ఇస్తాను. కౌలు రైతులకు సైతం పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం’’ అని చంద్రబాబు చెప్పారు. అంతకుముందు పర్యటనలో భాగంగా తెనాలికి చేరుకునే సమయంలో వీఎస్‌ఆర్‌, ఎన్‌వీఆర్‌ కళాశాల విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని చంద్రబాబుకు స్వాగతం పలికారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు