CM KCR: నా రాజకీయ జీవితమంతా పోరాటాలే: సీఎం కేసీఆర్‌

దేశమంతటా తెలంగాణ తరహా పరిస్థితి రావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో శనివారం ఆయన భేటీ అయ్యారు.

Updated : 01 Apr 2023 15:54 IST

హైదరాబాద్‌: ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటు పోట్లు చూశానని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. తన రాజకీయ జీవితమంతా పోరాటాలే అని తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో శనివారం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ సమక్షంలో మహారాష్ట్ర రైతు నేత శరద్‌జోషి, ప్రణీత్‌, తదితరులు భారాసలో చేరారు. వారికి కేసీఆర్‌ భారాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడారు. రైతుల పోరాటం వల్లే కేంద్ర ప్రభుత్వం 3 సాగు చట్టాలను రద్దు చేసిందని గుర్తుచేశారు. సాగు చట్టాలపై రైతులు చేసిన పోరాటం న్యాయమైందని.. తలచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు. సీఎంగా ఉండి కూడా తాను రైతుల కోసం దిల్లీలో పోరాటం చేశానన్నారు. 

దేశమంతటా తెలంగాణ తరహా పరిస్థితి..

యాసంగి సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో యాసంగిలో 50 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు అవుతోందన్నారు. తెలంగాణ వచ్చాక రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. దేశమంతటా తెలంగాణ తరహా పరిస్థితి రావాలని చెప్పారు. సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ దేశం అభివృద్ధి సాధించలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని