CM Kcr: వలసల వనపర్తిని.. వరి పంటల వనపర్తి చేసిన మొనగాడెవరు?: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు గుర్తించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

Updated : 26 Oct 2023 18:48 IST

వనపర్తి: తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు గుర్తించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

‘‘కొందరు కాంగ్రెస్‌ నేతలు అక్కడికిరా.. ఇక్కడికి రా.. అంటున్నారు. 119 నియోజకవర్గాల్లో కేసీఆర్‌లు ఉన్నారు.. వారితో తలపడాలి. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందెవరు? తెలంగాణ కోసం కొట్లాడిందెవరో ప్రజలు ఆలోచించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే వనపర్తిలో లక్ష ఎకరాలకు నీరు అందుతోంది. వలసల వనపర్తిని.. వరి పంటల వనపర్తిగా చేసిన మొనగాడెవరు? ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గతంలో ఎంతో మంది మంత్రులుగా పని చేశారు.. కానీ, ఒక్క వైద్య కళాశాల కూడా తీసుకురాలేకపోయారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి పట్టుబట్టి.. అయిదు మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చారు.

50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించలేదు: సీఎం కేసీఆర్‌

ముస్లింలను కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగానే చూసింది. వారి అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. తెలంగాణ గురుకులాల్లో ఇవాళ వజ్రాల్లాంటి విద్యార్థులు తయారవుతున్నారు. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పం. మళ్లీ గెలిస్తే.. పింఛన్లను దశలవారీగా రూ.5వేలకు పెంచుతాం. రైతులకు ఏ ప్రభుత్వమైనా డబ్బులు ఎదురిచ్చిందా? ఎన్ని మోటార్లు పెట్టారని ఇవాళ రైతులను ఎవరైనా అడుగుతున్నారా? రైతులు కట్టాల్సిన కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. రైతుల భూమిపై వారికే అధికారం కట్టబెట్టాం. వారిపై వీఆర్‌వో, ఆర్‌ఐ, ఎమ్మార్వో పెత్తనం లేకుండా చేశాం. వనపర్తి గొప్ప పట్టణంగా వెలుగొందుతుంది’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

దేశానికే దిక్సూచిలా తెలంగాణ ఎదిగింది: సీఎం కేసీఆర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని