KCR: రాష్ట్రంలో ఆకలి లేని రోజులు తెచ్చుకున్నాం: సీఎం కేసీఆర్‌

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌, సమీకృత వ్యవసాయ మార్కెట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, భారాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు.

Published : 20 Aug 2023 17:23 IST

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని, చాలా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌, సమీకృత వ్యవసాయ మార్కెట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, భారాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ మానవ అభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణం.

తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నాం. రూ.100 కోట్లతో ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మించుకున్నాం. ఇంత అద్భుతమైన కలెక్టరేట్లు, పోలీసు భవనాలు ఎక్కడా లేవు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కూడా మన కలెక్టరేట్ల వలే లేవు. రాష్ట్రంలో ఆకలి లేని రోజులు తెచ్చుకున్నాం. జట్టు కట్టి, పట్టుపట్టి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చూపిస్తున్నాం. ఎక్స్‌లెన్స్‌ దశకు చేరుకున్నాం, ఇంకా ముందుకు వెళ్లాలి. తెలంగాణ జీరో ఫ్లోరైడ్‌ రాష్ట్రమని కేంద్రమే ప్రకటించింది’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని