CM Revanth Reddy: తెలంగాణలో విద్యుత్‌ పరిస్థితిపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

తెలంగాణలో విద్యుత్‌ పరిస్థితి గందరగోళంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.

Published : 07 Dec 2023 22:30 IST

హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్‌ పరిస్థితి గందరగోళంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఇవాళ జరిగిన మంత్రివర్గ భేటీలో విద్యుత్‌పై జరిగిన చర్చలో సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అని ప్రశ్నించినట్లు సమాచారం. శుక్రవారం జరగనున్న సమీక్షకు సీఎండీలను కూడా పిలవాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై కర్ణాటక రాష్ట్రం వెళ్లి అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజల ఆకాంక్షల మేరకు అధికారుల పనితీరు ఉండాలని.. అధికారులు సమర్థంగా పని చేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని