CM Revanth: పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్‌

తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌పైనే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 

Published : 28 Mar 2024 16:37 IST

కొడంగల్‌: తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌పైనే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొడంగల్‌లోని తన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌కు 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు.  

‘‘ఎన్నికలు వస్తే సెలవులొస్తాయి.. తీర్థయాత్రలకు వెళ్దామని కొందరు అనుకుంటారు. ఓటు చాలా విలువైనది. ఎన్ని కార్యక్రమాలున్నా.. ఓటు వేసేందుకు కొడంగల్‌ వచ్చాను. కార్యకర్తలను కలవాలని వచ్చాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు నా వెంట ఉన్నారు. ప్రచారానికి రాకున్నా గెలిపించారు. ఇక్కడికి సిమెంట్‌ పరిశ్రమ రాబోతోంది. పరిశ్రమలు వస్తే భూముల ధరలు పెరుగుతాయి. ఫార్మా కంపెనీలు వస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది. ఏప్రిల్‌ 6న జరిగే తుక్కుగూడ కాంగ్రెస్‌ బహిరంగ సభకు.. కొడంగల్‌ నుంచి 25 వేల మంది తరలిరావాలి. ఈ సభలో రాహుల్‌ గాంధీ పాల్గొంటారు. 5 గ్యారంటీలు ప్రకటిస్తారు’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని