CM Revanth Reddy: భువనగిరి నేతలతో సీఎం సమావేశం.. ప్రచార కార్యక్రమాలపై దిశానిర్దేశం

భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసంలో ముగిసింది.

Updated : 10 Apr 2024 16:06 IST

హైదరాబాద్‌: భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసంలో ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విజయం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈనెల 21న నామినేషన్‌ వేయనున్న నేపథ్యంలో అదే రోజు భువనగిరిలో బహిరంగ సభ నిర్వహించాలని సీఎం సూచించారు. మే తొలి వారంలో నిర్వహించే సభకు ప్రియాంకగాంధీని ఆహ్వానిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజగోపాల్‌రెడ్డి, లోక్‌సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతోపాటు ముఖ్యనాయకులు హాజరయ్యారు. భువనగిరిలో చామల కిరణ్‌కుమార్ రెడ్డి గెలుపు కోసం నాయకులు , కార్యకర్తలు కృషి చేయాలని సీఎం కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని