CM Revanthreddy: రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనేదానిపై చర్చ జరగాలి: రేవంత్‌రెడ్డి

త్వరలో రైతు, విద్యా కమిషన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Published : 01 Mar 2024 19:49 IST

హైదరాబాద్‌: త్వరలో రైతు, విద్యా కమిషన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పౌరసంఘాలతో సమావేశం సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘ మన విద్యావిధానం ఎలా ఉండాలో కమిషన్‌ నిర్ణయిస్తుంది. 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేస్తాం. పైలట్‌ ప్రాజెక్టుగా కొడంగల్‌లో సమీకృత గురుకుల వర్సిటీ సముదాయం నిర్మిస్తాం. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం.

గత ప్రభుత్వంలో చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలు భర్తీ చేశాం. యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతాం. ధర్నాచౌక్‌, ప్రజాభవన్‌ అందుబాటులోకి తెచ్చాం. పంట మార్పిడి పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. కౌలు రైతుల సమస్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. అందరి సూచనలు, సలహాల ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం రూపొందించాలని యోచిస్తున్నాం. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం.. ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నాం’’ అని సీఎం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని