Revanth Reddy: నన్ను దెబ్బతీసేందుకు గూడుపుఠాణీ చేస్తున్నారు: రేవంత్‌

కొడంగల్‌లో కాంగ్రెస్‌ను ఓడించి.. తనను కిందపడేయాలని భాజపా, భారాస కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 

Published : 09 Apr 2024 00:03 IST

కొడంగల్‌: గడిచిన వంద రోజుల్లో కొడంగల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కొడంగల్‌ కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ నేతలు, ఏడు మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బూత్‌స్థాయి నేతలు సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. భాజపా, భారాసకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వడంలో మోదీ విఫలమయ్యారని, పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వకుండా గులాబీ పార్టీ వంచించిందని విమర్శించారు. 

‘‘కొడంగల్‌లో కాంగ్రెస్‌ను ఓడించి.. నన్ను కిందపడేయాలని భాజపా, భారాస కుట్రలు చేస్తున్నాయి. పదేళ్లుగా ప్రధాని మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారు? నన్ను దెబ్బతీయడానికి గూడుపుఠాణీ చేస్తున్నారు. నేను ఎక్కడున్నా.. నా గుండె చప్పుడు కొడంగల్‌ మాత్రమే. ఈ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలి’’ అని రేవంత్‌ పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని