CM Revanth Reddy: పోలింగ్‌కు నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేయాలి: సీఎం రేవంత్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి జూమ్‌ సమావేశం నిర్వహించారు.

Updated : 22 May 2024 21:42 IST

హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం నిర్వహించిన జూమ్‌ సమావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో పాటు మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇన్‌ఛార్జిలు, అసెంబ్లీ నియోజక వర్గ ఇన్‌ఛార్జిలు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లోని కాంగ్రెస్‌ నేతలు క్రియాశీలకంగా ఉండాలని సూచించారు. ఈనెల 27న పోలింగ్‌కు కార్యకర్తలు, నాయకులను సన్నద్ధం చేయాలన్నారు. తమ పరిధిలోని అన్ని బూత్‌లను ఎమ్మెల్యేలు సందర్శించాలని, పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని