TS Elections: మంత్రి కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌

రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్‌ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌.. భారాస క్యాడర్‌కు పిలుపునిచ్చి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

Published : 29 Nov 2023 17:22 IST

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్‌ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌.. భారాస క్యాడర్‌కు పిలుపునిచ్చి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు.. కాంగ్రెస్‌ పార్టీ సమన్వయ కమిటీ ఛైర్మన్‌ జి.నిరంజన్‌ తెలంగాణ సీఈవో వికాస్‌ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. దీక్షా దివస్‌ సందర్భంగా భారాస కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడాన్ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి, మీడియాపై ఆంక్షలు, 144 సెక్షన్‌ అమల్లో ఉన్నా..  దీక్షా దివస్‌ కార్యక్రమాలు నిర్వహించడం ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని లేఖలో వివరించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మంత్రి కేటీఆర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని