Congress: కౌంటింగ్‌ నిబంధనలపై కాంగ్రెస్‌ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ

కౌంటింగ్‌ ఏజెంట్ల విషయంలో ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్‌ నేత తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఈసీ స్పందించింది.

Published : 02 Jun 2024 11:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కౌంటింగ్‌ నిబంధనలు ఈవీఎంల రిగ్గింగ్‌ కోసమే మార్చారంటూ ఓ కాంగ్రెస్‌ (Congress) నేత చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీనిపై స్పందించిన దిల్లీ ఈసీ వివరణ ఇచ్చింది. ‘‘అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లను తొలిసారి ఏఆర్‌వో టేబుల్స్‌ వద్దకు అనుమతించడంలేదు. నేను తొమ్మిది లోక్‌సభ, విధాన్‌సభ ఎన్నికలను చూశాను. ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇదే నిజమైతే ఈవీఎంల రిగ్గింగ్‌ కన్నా పెద్దది. ఈ విషయంపై నేను అభ్యర్థులను అప్రమత్తం చేస్తున్నాను. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తుందని ఆశిస్తున్నా’’ అని కాంగ్రెస్‌ నేత అజేయ్‌ మాకెన్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో నిన్న ఆరోపించారు. 

ఈ ఆరోపణలపై నేటి ఉదయం దిల్లీ ఈసీ దీనిపై ఎక్స్‌ వేదికగా స్పందించింది. మాకెన్‌ ట్వీట్‌పై తాము వివరణ ఇస్తున్నట్లు పేర్కొంది. ‘‘అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లను ఆర్‌వో, ఏఆర్‌వోల టేబుళ్ల వద్దకు అనుమతించాం’’ అని వెల్లడించింది. దీనిపై స్పందించిన మాకెన్‌.. ‘‘ఇది ఎంతో కీలకమైన వివరణ. మీ రిటర్నింగ్‌ ఆఫీసర్లు నేటి ఉదయం వరకు ఈ విషయంలో అంతసానుకూలంగా లేరు’’ అని పేర్కొన్నారు. 

మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ విషయంలో ఇండియా కూటమి నేతలు విముఖంగా ఉన్నారు.  ప్రభుత్వ సర్వేలు, దాని సన్నిహిత మీడియా వర్గాల సర్వేలను విశ్వసించలేమని కాంగ్రెస్‌ నేత ఖర్గే అన్నారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కూటమి శ్రేణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా నేతలు మాట్లాడుకున్నట్లు వివరించారు. లెక్కింపు ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే కౌంటింగ్‌ కేంద్రాలను వీడాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. తమకు ఎదురైన కొన్ని సమస్యలను ఎన్నికల కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆదివారం  సమయం కోరినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని