మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేతల ఆందోళన.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

తమ నాయకులపై దాడులకు పాల్పడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేయాలని మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేపట్టారు.

Updated : 02 Dec 2023 22:30 IST

మహబూబ్‌నగర్‌ క్రైం: తమ నాయకులపై దాడులకు పాల్పడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేయాలని మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పీఆర్‌టీయూ మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డిపై మంత్రి సోదరుడు అకారణంగా దాడి చేశాడంటూ గ్రామీణ పోలీసు స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో హైదరాబాద్‌-రాయచూర్ ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలింగ్ జరిగినప్పటి నుంచి కాంగ్రెస్‌ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. తమపై జరుగుతున్న దాడులపై పోలీసులు స్పందించడం లేదంటూ కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై కేసు నమోదు చేసే వరకు నిరసన విరమించేది లేదని కాంగ్రెస్‌ నేతలు రోడ్డుపైనే బైఠాయించారు.

ఘటనపై కాంగ్రెస్‌ అభ్యర్థి యొన్నం శ్రీనివాస్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ దాడులు చేయిస్తున్నారని.. ఆయన్ను ముందస్తు అరెస్టు చేయకపోతే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని