Revanth Reddy: భారత్‌ జోడో యాత్రకు భద్రత కల్పించండి.. డీజీపీకి రేవంత్‌ వినతి

తెలంగాణలో జరగనున్న రాహుల్ గాంధీ భారత్‌ జోడో పాదయాత్రకు భద్రత కల్పించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అక్టోబరు 24న కర్ణాటకలోని రాయ్‌చూర్‌ నుంచి తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లోకి రాహుల్‌ ప్రవేశిస్తారని తెలిపారు.

Published : 02 Oct 2022 01:24 IST

హైదరాబాద్‌: తెలంగాణలో జరగనున్న రాహుల్ గాంధీ భారత్‌ జోడో పాదయాత్రకు భద్రత కల్పించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతలు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి జోడో పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... అక్టోబరు 24న కర్ణాటకలోని రాయ్‌చూర్‌ నుంచి తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లోకి రాహుల్‌ ప్రవేశిస్తారని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాహుల్‌ గాంధీ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ను డీజీపీకి అందజేసినట్టు చెప్పారు. శంషాబాద్‌, ఆరాంఘర్‌, చార్మినార్‌, గాంధీభవన్‌, మాసబ్‌ట్యాంక్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, బీహెచ్‌ఈఎల్‌ మీదుగా రాహుల్‌ గాంధీ పాదయాత్ర కొనసాగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రజలంతా భారత్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలని కోరారు.  దేశ విభజనకు కుట్ర చేస్తున్న శక్తులను ఎదుర్కోవాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్య వాదులు రాహుల్‌ పాదయాత్రలో పాల్గొనాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు