ఉద్యోగాల భర్తీ ఆలస్యమవుతోంది.. వారి రాజీనామాలు ఆమోదించండి: గవర్నర్‌కు జీవన్‌రెడ్డి లేఖ

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కోరారు.

Published : 09 Jan 2024 15:53 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాశారు.

‘‘టీఎస్‌పీఎస్సీకి ఛైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. నెలరోజులుగా ఛైర్మన్, సభ్యుల రాజీనామాలు ఆమోదించలేదు. ఇలా అయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. ఛైర్మన్‌ లేకపోవడం వల్ల పరీక్షల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. టీఎస్‌పీఎస్సీలో అవకతవకలు జరిగాయి. నియామకాల విషయంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కమిషన్‌లో జరిగిన తప్పిదాలను గత ప్రభుత్వం కప్పిపుచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉంది’’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని