Archana Patil: కాంగ్రెస్‌ నుంచి మరొకరు ఔట్‌.. భాజపా గూటికి అర్చన పాటిల్‌

 ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు వరుసగా పార్టీని వీడుతుండడంతో అధికార వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మరో ముఖ్య నేత భాజపా గూటికి చేరారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్రమంత్రి శివరాజ్ పాటిల్‌ కోడలు అర్చనా పాటిల్‌ కాంగ్రెస్‌ను వీడారు.

Updated : 30 Mar 2024 17:07 IST

ముంబయి: లోక్‌సభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత, శివరాజ్ పాటిల్ కోడలు అర్చన పాటిల్ శనివారం భాజపాలో చేరారు. అర్చన పాటిల్ ఉద్గీర్‌లోని లైఫ్‌కేర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్‌పర్సన్‌గా విధులు నిర్వర్తిస్తుండగా ఆమె భర్త శైలేష్ పాటిల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

‘‘రాజకీయాల్లో సేవలందించడానికే నేను భాజపాలో చేరాను. ప్రధాని మోదీ తీసుకువచ్చిన నారీ శక్తి వందన్ అధినియం నన్ను బాగా ప్రభావితం చేసింది. ఇది మహిళలకు అన్నిరంగాల్లో సమాన అవకాశాన్ని కల్పిస్తుంది. నేను లాతూర్‌లో అట్టడుగు స్థాయిలో పనిచేశాను. భాజపాలో కూడా అదేవిధంగా పని చేస్తాను. నేను అధికారికంగా కాంగ్రెస్‌లో లేను. భాజపా భావజాలం నన్ను ఆకర్షించింది కాబట్టి ఇందులో చేరాను’’ అని అర్చన పాటిల్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అర్చన ఆయన అధికారిక నివాసం 'సాగర్'లో శుక్రవారం కలిసి చర్చలు జరిపారు. అనంతరం శనివారం ఫడ్నవీస్‌, ఇతర భాజపా నేతల ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని