Congress has a huge majority in Khammam: తెలంగాణలో బోణీ కొట్టిన కాంగ్రెస్‌.. ఖమ్మంలో భారీ మెజార్టీ

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలంగాణలో తొలి విజయం నమోదైంది.

Updated : 04 Jun 2024 13:32 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలంగాణలో తొలి విజయం నమోదైంది. ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 3.5 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఆయన విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన మల్లు రవి (నాగర్‌కర్నూల్‌), కడియం కావ్య (వరంగల్‌), గడ్డం వంశీకృష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి (భువనగిరి), బలరాం నాయక్‌(మహబూబాబాద్‌), కుందురు రఘువీర్‌ రెడ్డి (నల్గొండ), సురేశ్‌ షెట్కార్(జహీరాబాద్‌) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని