MLC Bypoll: కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టారు.

Updated : 05 Jun 2024 09:54 IST

వరంగల్‌: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టారు. 96 టేబుళ్లపై కౌంటింగ్‌ సాగుతోంది. ఇందులో 2,800 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పోలింగ్‌ను మే 27న నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తీన్మార్‌ మల్లన్న (కాంగ్రెస్‌), రాకేశ్‌రెడ్డి (భారాస), ప్రేమేందర్‌రెడ్డి (భాజపా) బరిలో నిలిచారు.

ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో భారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని