Mamata Banerjee: బెంగాల్‌లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు.

Published : 19 Apr 2024 17:25 IST

కోల్‌కతా:  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. ముర్షిదాబాద్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్, సీపీఐ(ఎం)లకు అనుకూలంగా ఓట్లు వేయవద్దని ప్రజలను కోరారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి లేదు. కేంద్రంలో ప్రతిపక్షాల కూటమి ఏర్పాటులో నేనే కీలకపాత్ర పోషించాను. కూటమి పేరు కూడా నేనే పెట్టాను. కానీ బెంగాల్‌లో సీపీఐ (ఎం), కాంగ్రెస్‌లు భాజపా కోసం పని చేస్తున్నాయి. మీరు భాజపాను ఓడించాలనుకుంటే కాంగ్రెస్, సీపీఐ(ఎం)కు ఓట్లు వేయకండి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

పశ్చిమబెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మమతా బెనర్జీ జనవరిలో ప్రకటించారు. సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్‌తో వచ్చిన విభేదాల కారణంగా మమత ఈనిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్రంలో రామనవమి వేడుకల సందర్భంగా భాజపా హింసను ప్రేరేపిస్తోందని, ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింస ‘ముందస్తు ప్రణాళిక’ అని మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే రామనవమి వేడుకల సందర్భంగా జరిగిన హింసాకాండను అడ్డుకొని, బెంగాలీ హిందువులను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని భాజపా ఎదురు దాడికి దిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని