AP News: వామపక్షాలతో పొత్తుల దిశగా కాంగ్రెస్‌ చర్చలు

ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలతో పొత్తుల దిశగా కాంగ్రెస్ చర్చలు ప్రారంభించింది.

Updated : 23 Feb 2024 11:08 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలతో పొత్తుల దిశగా కాంగ్రెస్ చర్చలు ప్రారంభించింది. విజయవాడలోని పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో సీపీఐ, సీపీఎం నేతలు సమావేశమయ్యారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశం, పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వారు చర్చించారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో వామపక్ష పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

భేటీ అనంతరం వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ.. ‘‘జగన్‌ మనకు రాజధాని లేకుండా చేశారు. ఉమ్మడిగా ప్రజా పోరాటాలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. హోదా తెస్తాం.. అధికారం ఇవ్వండని జగన్‌ అన్నారు. భాజపా మెడలు వంచుతామన్న జగన్‌.. ఒక్క పోరాటం కూడా చేయలేదు. హోదా ఇవ్వకపోవడం వల్లే ఏపీకి పరిశ్రమలు రావడం లేదు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండి ఉంటే ఏపీకి అప్పుడే ప్రత్యేక హోదా వచ్చేది’’ అని షర్మిల పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని