CPI: భాజపా మూడోసారి అధికారంలోకి వస్తే.. దేశానికి విపత్తు వచ్చినట్టే: డి.రాజా

కేంద్రంలో భాజపా మూడోసారి అధికారంలోకి వస్తే దేశానికి విపత్తు వచ్చినట్టే అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు.

Updated : 04 Feb 2024 17:22 IST

హైదరాబాద్‌: కేంద్రంలో భాజపా మూడోసారి అధికారంలోకి వస్తే దేశానికి విపత్తు వచ్చినట్టే అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఆ పార్టీ జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘3 రోజులపాటు జరిగిన సమావేశాల్లో రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఎలా సన్నద్ధం కావాలో చర్చించాం. మోదీ మరోసారి అధికారంలోకి వస్తానంటున్నారు. కానీ, పదేళ్లలో ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారు?  రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తేలేదేం? మధ్యంతర బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి కోసం ఏమీ లేదు. ఫిబ్రవరి 16న వాణిజ్య, రైతు సంఘాలు నిర్వహించే బంద్‌కు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మా పూర్తి మద్దతు ఉంటుంది.  భాజపా హఠావో దేశ్‌ బచావో అని మొదటిసారిగా చెప్పిన నీతీశ్‌ కుమార్‌ మళ్లీ భాజపా పంచనే చేరారు. ఇండియా కూటమిని మోసం చేసిన నీతీశ్‌.. చరిత్రలోని చాలా ప్రశ్నలకు జవాబు చెప్పాలి. రాబోయే ఎన్నికలు చాలా ప్రధానమైనవి.. భాజపాను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. దేశ వ్యాప్తంగా సముచిత స్థానాల్లో పోటీ చేసేలా ‘ఇండియా’ కూటమితో చర్చలు జరుపుతున్నాం. అందుకు సంబంధించి కమిటీ కూడా వేశాం’’ అని తెలిపారు.
‘‘రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌ లాంటి వారు సురక్షితంగా ఉన్నారు. ఝార్ఖండ్‌ మాజీ సీఎం ఈడీ విచారణలో ఉన్నారు. భాజపానే దీనికి కారణం’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని