‘హోదా’పై మోదీ వద్ద జగన్‌ కనీస ప్రస్తావన కూడా తీసుకురాలేదు: రామకృష్ణ

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతూ ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 01 Mar 2024 16:35 IST

విజయవాడ: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతూ ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం కాదని.. మోసం చేసిన అధ్యాయమన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలపై విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడిని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేత హోదాలో చెప్పిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ దగ్గర కనీస ప్రస్తావన కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఇప్పటికైనా దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని