CPI Narayana: కేసీఆర్‌ కుమార్తెను కాపాడేది భాజపా కాదా?: నారాయణ

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

Updated : 11 Oct 2023 14:24 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. కేసీఆర్‌ కుమార్తెను కాపాడేది భాజపా ప్రభుత్వం కాదా?అని ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో రాజీ ఒప్పందం కుదిరిన తర్వాతనే.. వైకాపా, కేసీఆర్‌, భాజపా కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు.

అందుకే మనీశ్ సిసోదియాను జైల్లో పెట్టారని మండిపడ్డారు. అందరూ కలిసి కుమ్మక్కై సిసోదియాను మాత్రమే ఇరికించారన్నారు. సత్యం రామలింగరాజు మీద సెబీ ఎంక్వెయిరీ వేశారని.. అదానీ కుంభకోణంలో ఎందుకు సెబీ ఎంక్వెయిరీ వేయలేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం బయట పెడితే ఆయనను కాపాడుకుంటున్నారని నారాయణ దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని