కాంగ్రెస్‌, సీపీఐ మధ్య తగువు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు: సీపీఐ నారాయణ

సింగరేణి ఎన్నికల తరువాత రాజకీయంగా కాంగ్రెస్‌, సీపీఐ మధ్య తగువు వచ్చిందని.. ఈ రెండు పార్టీలు విడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) మండిపడ్డారు.

Updated : 29 Dec 2023 17:08 IST

హైదరాబాద్‌: సింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్‌, సీపీఐ మధ్య తగువు వచ్చిందని.. ఈ రెండు పార్టీలు విడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) మండిపడ్డారు. కార్మికుల ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో భారాస అధికారంలో ఉన్నప్పుడు దుష్ట సంప్రదాయానికి తెరలేపిందన్నారు. ఎన్నికల వేళ కార్మికులను ప్రలోభాలకు గురిచేశారని మండిపడ్డారు. సింగరేణి ఎన్నికల్లో భారాస అనుబంధ సంఘాన్ని ఓడించామన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని