CPI Narayana: పాపాలన్నీ జగన్‌ చేసి.. ఎమ్మెల్యేలను మారిస్తే ఏం లాభం?: సీపీఐ నారాయణ

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై (YS Jagan) ప్రజల్లో వ్యతిరేకత ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు.

Updated : 12 Dec 2023 19:44 IST

తిరుపతి: ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై (YS Jagan) ప్రజల్లో వ్యతిరేకత ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఏమీ జరగదని వైకాపా అధిష్ఠానాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. 

‘‘తెలంగాణలో (Telangana) మాదిరిగానే ఏపీలో కూడా ప్రభుత్వం మార్పు తప్పదు. జగన్‌ పాలనలో అహంకారం, నియంతృత్వం పెరిగిపోయింది. ఆయన హెలికాప్టర్‌లో తిరిగితే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి. సీఎం (CM Jagan) పర్యటన కోసం మనుషులను నిర్బంధించడం దారుణం’’ అని నారాయణ విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు