CPI Ramakrishna: సీఎం జగన్‌, మంత్రులు పొలంబాట పట్టాలి: సీపీఐ రామకృష్ణ

రాష్ట్రంలోని 18 జిల్లాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

Updated : 31 Oct 2023 10:13 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని 18 జిల్లాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి ఆయన లేఖ రాశారు. సీఎం, మంత్రులు పొలంబాట పట్టాలని సూచించారు. పంటలు ఎండిపోవడంతో రైతులు దిగాలుగా ఉన్నారని చెప్పారు. 

తక్షణమే ఏపీలో కరవు మండలాలను ప్రకటించాలని కోరారు. ‘‘కరవు పీడిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించేట్లు చూడాలి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సత్వర చర్యలు చేపట్టాలి’’ అని సీఎంకు రాసిన లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని