CPI Ramakrishna: ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోంది: సీపీఐ రామకృష్ణ

ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

Updated : 25 Sep 2023 09:30 IST

విజయవాడ: ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రజాస్వామిక హక్కులకు రాష్ట్ర ప్రభుత్వం పాతరేస్తోందని ఆయన ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది. సీఎం జగన్‌ ప్రజా ఉద్యమాలను అణచివేసే కుట్రతో పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ దుష్ట విధానాలను ఖండించాలి’’ అని కె రామకృష్ణ పిలుపునిచ్చారు. 

తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూల అనుబంధ సంఘాల అంగన్వాడీలు ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ వారిని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని