Chandrababu Arrest: సీఐడీ పేరు మార్చుకొని ‘జేపీఎస్‌’గా పెట్టుకోవాలి: సీపీఐ రామకృష్ణ

ఎలాంటి ఆధారాలు లేకుండా తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.

Published : 02 Oct 2023 14:56 IST

విజయవాడ: ఎలాంటి ఆధారాలు లేకుండా తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అరెస్టు చేసిన ఇన్ని రోజులకు కూడా సీఐడీ అధికారులు ఆధారాల కోసం వెతుక్కుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో తప్పుడు కేసులు, అరెస్టులను నిరసిస్తూ విజయవాడలోని కేశినేని భవన్‌ వద్ద ‘సత్యమేవ జయతే దీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఐడీ పేరు మార్చుకొని జేపీఎస్ (జగన్ ప్రైవేట్ సైన్యం)గా పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు వెనక భాజపా పెద్దలు మోదీ, అమిత్ షా హస్తం కచ్చితంగా ఉందని భావిస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని