జగన్‌ పండగ చేసుకుంటూ.. అంగన్వాడీలను వీధుల పాల్జేశారు: సీపీఐ రామకృష్ణ

అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

Published : 15 Jan 2024 11:03 IST

విజయవాడ: అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ వ్యాప్తంగా 1.06 లక్షల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండగకు వైకాపా ప్రభుత్వం దూరం చేసిందన్నారు. ఇచ్చిన మాట అమలు చేసుంటే వారు రోడ్డుపైకి వచ్చేవారా?అని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలెందుకు జరపడం లేదని నిలదీశారు. మాట తప్పను.. మడమ తిప్పను అంటే ఇదేనా? అని మండిపడ్డారు. జగన్‌ పండగ చేసుకుంటూ అంగన్వాడీలను వీధుల పాల్జేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి అంగన్వాడీ కుటుంబాల ఉసురు తగులుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని