CPI Ramakrishna: కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం తక్షణమే చేపట్టండి: రామకృష్ణ

కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన లేఖ రాశారు.

Published : 24 Dec 2023 10:09 IST

అమరావతి: కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన లేఖ రాశారు. ప్లాంట్‌ నిర్మాణానికి 2019, 2023లో రెండుసార్లు భూమిపూజ చేశారని, ప్లాంట్‌ నిర్మించి 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని లేఖలో గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని