కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ

కాంట్రాక్టర్లను వైకాపాకు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 13 Jan 2024 13:30 IST

అనంతపురం: కాంట్రాక్టర్లను వైకాపాకు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి గుత్తేదారుని బెదిరించి, కూలీలను కిడ్నాప్ చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ కాంట్రాక్టర్‌ వెళ్లి పశ్చిమ బెంగాల్‌ ఎంపీ ఖాన్‌చౌదరికి ఫిర్యాదు చేశారని చెప్పారు. దీనిపై ఇతర రాష్ట్రాల ఎంపీలు స్పందించినా అనంతపురం జిల్లా పోలీసులు ఎందుకు స్పందించడంలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు ఊడిగం చేయడానికేనా ఖాకీ డ్రస్సు ఇచ్చిందంటూ నిలదీశారు. సిగ్గులేని ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నా.. సీఎం స్పందించడం లేదంటే దీంట్లో ఆయనకూ భాగం ఉందని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని